పోస్ట్‌లు

అక్టోబర్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

వీచిక - 9

చిత్రం
ఈతడేమో నరుడు. ఆతడు నరుణ్ణి కిరాతరూపంలో పరీక్షిస్తున్న నటుడు. నరుడికీ, నటుడికీ మధ్య హిమగిరి సానువులలో, ఘోరమైన మల్లయుద్ధం జరుగుతూంది. అర్జునః - అంటే సంస్కృతంలో తెల్లని వాడని అర్థం.  వేలుపు కూడా వెండివన్నె వాడే. వారిద్దరికి మధ్య వెండికొండల మధ్య యుద్ధం. వాళ్ళిద్దరి ముష్టిఘాతాల శబ్దం పగులుతున్న బండరాళ్ళశబ్దం ఆ పర్వతసానువులలో మారుమ్రోగుతోంది. పార్థుని కరఘాతాలు శూలిని ఏమీ చేయలేకపోతున్నాయి. సముద్రపు అలలు వింధ్యపర్వతాన్ని తాకినట్టుగా. ఆ నేపథ్యంలో - ఉమాపతి ఫల్గుణుని రెండు భుజాలపై ఒకేసారి కొట్టిన దెబ్బకు ఈతడు తూలి, పది అడుగుల వెనక్కు వెళ్ళిపడ్డాడు.  మహా రోషంతో, పరాక్రమంతో లేచి మౌళి భుజాలను బలంగా పట్టుకున్నాడు. ఇద్దరూ భూమిపై దొరలుతున్నారు. దేవగణం ఈ యుద్ధాన్ని విస్మయపడుతూ చూస్తున్నది. ఆపై పైకి లేచిన మహేశ్వరుడు జబ్బలు చరిచి, సింహనాదం చేసి పైకెగిరాడు. వియతి వేగపరిప్లుతమంతరా సమభిసృత్య రయేణ కపిధ్వజః | చరణయోశ్చరణానమితక్షితిః నిజగృహే తిసృణాం జయినం పురామ్ || వియతి = ఆకాశానికి వేగపరిప్లుతం = వేగంగా కుప్పించి ఎగసిన తిసృణాం పురాం జయినమ్ = త్రిపురాంతకుని ఈశ్వరుని చరణయోః = పాదద్...