పోస్ట్‌లు

సెప్టెంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

వీచిక - 5

చిత్రం
ప్రాచీన సంస్కృతసాహిత్యంలో కనిపించిన ఒక చిత్రమైన హైర్ స్టైల్ గురించి, ఇంకొన్ని విషయాల గురించి కొన్ని ముచ్చట్లు. అశోక వృక్షం క్రింద కూర్చుని ఒకాయన సుందరీవిరహవేదన పడుతున్నాడు. సుందరి - అతని భార్య పేరు. సార్థకనామధేయ. ఈతని పేరు నందుడు. ఆ కావ్యం సౌందరనందం.  కావ్యాన్ని రచించిన మహాకవి కాళిదాసుకన్నా పూర్వుడైన అశ్వఘోషుడు. ప్రియురాలయిన సుందరిని వదిలి నందుడు, బుద్ధుని ద్వారా ప్రవ్రజన దీక్ష స్వీకరించాడు. కానీ ఆమెను మర్చిపోలేకపోతున్నాడు. ఏ తీగను చూసినా, కొమ్మను చూసినా సుందరి జ్ఞాపకం వస్తున్నది. పిప్పలి లతను చూస్తే ఆ లతకు పూచిన పువ్వులాంటి సుందరి ముఖం గుర్తొస్తూంది. మామిడి చెట్టుకు అల్లుకున్న మాధవీలతను చూడగానే తనను పెనవేసుకునే సుందరి తనువు గుర్తొచ్చింది.  అలాగే - పుష్పావనద్ధే తిలకద్రుమస్య దృష్ట్వాऽన్యపుష్టాం శిఖరే నివిష్టామ్ | సంకల్పయామాస శిఖాం ప్రియాయాః శుక్లాంశుకాऽట్టాలమపాశ్రితాయాః || తెల్లటి పూలతో విరగపూచిన తిలకపు చెట్టు కొమ్మ పైన కూర్చున్న కోకిల ను చూచి మేడపైన ప్రియురాలి సిగపైన తెల్లటి పట్టువస్త్రంతో చుట్టిన కేశపాశా న్ని తలుచుకుంటున్నాడు. అంశుకం అంటే సన్నని పట్టువస్త్రం. శు...