వీచిక - 4
 ఒక నీరసమైనదీ, ఎబ్బెట్టయినదీ అయిన చమత్కారశ్లోకం ఈ సారి. ఇది లక్ష్మీనారాయణుల శృంగారవర్ణన. గాథాసప్తశతి లోనిది.   విపరీతసురతసమయే బ్రహ్మాణం దృష్ట్వా నాభికమలే |  హరేర్దక్షిణనయనం చుంబతి హ్రియాకులే లక్ష్మీ ||   విపరీతసురతసమయే = పురుషాయితం అనే శృంగారక్రీడలో   నాభికమలే = విష్ణువు నాభికమలంలో  బ్రహ్మాణం దృష్ట్వా = బ్రహ్మను చూచి  హ్రియాకులే లక్ష్మీ = సిగ్గుపడిన లక్ష్మి  హరేః = విష్ణువు యొక్క  దక్షిణనయనం = కుడికంటిని  చుంబతి = ముద్దాడింది.   ముద్దాడింది. అయితే ఏంటి?   విష్ణువుకు సూర్యచంద్రులిద్దరూ చెరొక కన్ను. విష్ణుసహస్రనామంలో -  "భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిల చంద్రసూర్యౌ చ నేత్రే"- అని ఉంది.  యస్య = ఎవని  పాదౌ = రెండు పాదాలు  భూః = భూమి,  నాభిః = బొడ్డు   వియత్ = ఆకాశము,  అసుః = శ్వాస  అనిలః = వాయుదేవుడు,  చ = ఇంకా  చంద్రసూర్యౌ = సూర్యచంద్రులు  నేత్రౌ = రెండు కళ్ళు"  ...  ...   (సాధారణంగా ద్వంద్వసమాసంలో పూర్వపదం ప్రసిద్ధమైనది, ఉత్తరపదం తక్కువ ప్రసిద్ధమైనదిగా ఉండాలని ఒక వ్యాకరణ నియమం. రామలక్ష్మణులు, భార్యాభర్తలు, తల్లితండ్రులు, ఇలాగ. ఆ వరుసలో సూర్యచంద్రులు అనడం సమంజసం. ఇక్కడ చంద్రస...