పోస్ట్‌లు

జూన్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

వీచిక - 1

చిత్రం
వర్షాకాలం ఎంతో దూరం లేదు. ఈ వర్షాకాలం మొదలవగానే పలకరించే అందమైన పూవు పారిజాతం. దీనినే సంస్కృతంలో శేఫాలికా అంటారుట. తెలుగులో నల్లనావిలిపువ్వని బ్రౌణ్యము. ఈ పువ్వు రాత్రి పూట పూస్తుంది. ఉదయమవగానే ఈ చెట్టు దాపుల కుప్పకుప్పలుగా ఈ పూలు నేలపైన పడి ఉంటాయి.  శేఫాలికకు తొడిమ ప్రత్యేకం. స్వచ్ఛసితవర్ణానికి కాషాయరంగు అపూర్వమైన కలయిక. తెల్లటి ఈ పువ్వు ఒకరోజు గడిస్తే కాస్త పచ్చబారుతుంది. అలానే తొడిమకూడా రంగు మారిపోతుంది. ఇక పద్యానికి - ఉదయనుడనే ఒక రాజు ఒకానొక ఉదయాన తన మిత్రుడు వసంతకుడనే వాడితో తోటకెళ్ళాడు. అక్కడ తోటలో ఒక దీర్ఘిక (దిగుడుబావి), పక్కనే ఈ శేఫాలికా పూల చెట్లూ, ఇంకా రకరకాల చెట్లూ ఉన్నాయి. ఈ పూలు తోట తాలూకు నేలంతా పరుచుకుని ఉన్నాయి. అది చూచి ఆ మహారాజు ఇలా అంటున్నాడు. వృన్తైః క్షుద్రప్రవాళస్థగితమివ తలం భాతి శేఫాలికానాం గన్ధ స్సప్తచ్ఛదానాం సపది గజమదామోదమోహం తనోతి ఏతే చోన్నిద్రపద్మచ్యుతబహుళరజః పుంజ పింగాంగరాగాః గాయన్తవ్యక్త వాచః కిమపి మధులిహో వారుణీపానమత్తాః తలం = ఈ నేల శేఫాలికానాం వృన్తైః = వావిలి పూల తొడిమలచేత (నిండినదై) క్షుద్రప్రవాళ = చిన్న చిన్న పగడాలచేత స్థగితం ఇవ = మూసిపెట్టబడిన...