వక్రోక్తి మంగళాచరణము

రాజానక కుంతలకుడు తన ’వక్రోక్తి జీవితమ్’ అలంకారశాస్త్ర గ్రంథారంభంలో సరస్వతీదేవికి మంగళాచరణం చేస్తున్నాడు. వందే కవీంద్రవక్త్రేందులాస్యమందిరనర్తకీమ్ | దేవీం సూక్తిపరిస్పందసుందరాభినయోऽజ్జ్వలామ్ || అనువాదము: గీ || వందనమ్ములు సుకవిముఖేందుబింబ మందిరనివాసినీలాస్యసుందరికిని, కుంద హసితకు, మధువచః స్పందనంది తోజ్జ్వలాభినయరసనిష్పందినికిని. సవరణ: గీ || వందనమ్ములు సుకవిముఖేందుబింబ మందిరనివాసినీలాస్యసుందరికిని, కుంద హసితకు, మధువచః స్పందతుషిత భాసురాభినయరసనిష్పందినికిని.