తేటగీతి గర్భిత చంపకమాల
నా మొదటి గర్భకవిత.   చం||  కనుగొనఁ జక్కనౌ సిరియె గాదిలి పత్నియు సింహరూపి యై  ప్రణతులఁ గాచునా హరికి; వాణియె భార్య మహాత్ములెన్న గా  ధునివలె యబ్ధికిన్ శతధృతుండు-విరించికి; సాంబమూర్తి కి  న్ననయముఁ గూర్మిగా వపువు నర్ధము గౌరియుఁ వాసి నొప్పె డిన్.  గర్భిత తేటగీతి:  సిరియె గాదిలి పత్నియు సింహరూపి  హరికి; వాణియె భార్య మహాత్ము లెన్న  శతధృతుండు విరించికి; సాంబ మూర్తి  వపువు నర్ధము గౌరియుఁ వాసి నొప్పె.  పై పద్యాలు రెంటికీ "హరికి వాణియె భార్య మహాత్ము లెన్న" అన్న శంకరాభరణం బ్లాగులో ఇవ్వబడిన సమస్య  మూలం.   తేటగీతి గర్భిత చంపక/ఉత్పల మాల వ్రాయడానికి సూచనలు:  ౧. మొదట తేటగీతి పద్యంతో ఆరంభించాలి.  ౨. మామూలుగా తేటగీతిలో ప్రతిపాదంలోనూ ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు కావాలి. గర్భిత తేటగీతి మాత్రం ప్రతిపాదమూ "న భ భ ర ల" గణాలతో ఉండాలి.  ౩. రెండవ గణం "భ" మొదటి అక్షరం చంపక/ఉత్పల మాల తో యతిమైత్రి చెల్లించాల్సిన స్థానం. గుర్తుపెట్టుకోవాలి.  ౩. పాదాంతంలో సమాసాలు కూరిస్తే ఇబ్బంది. ఉదా: "కామదహనుడు" - ఇందులో "కామ" పాదం చివర్లో వచ్చి తరువాతి పాదం "ద...