పోస్ట్‌లు

ఆగస్టు, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మయూఖము - 5

చిత్రం
విష్ణువు - వైష్ణవం ఇంద్రుడు - ఐంద్రీ (తూరుపు దిక్కు) వినత - వైనతేయుడు మిత్రుడు - మైత్రి విరాగి - వైరాగ్యము విదేహ - వైదేహి వివిధములు - వైవిధ్యత ధీరుడు - ధైర్యము సంస్కృతంలో ’ఇ’ కారంతో ఆరంభమయ్యే కొన్ని శబ్దాలయొక్క ’సంబంధించిన’ అన్న అర్థంతో వచ్చు రూపాలు ’ఐ’ కారంతో ఏర్పడతాయని మనకు తెలుస్తోంది. నేను వ్యాకరణ వేత్తను కాను కాబట్టి ఏ శబ్దాలకు అలా ’ఐ’ కారపు రూపాలు ఏర్పడతాయో తెలియదు. విష్ణువు - నకు "సంబంధించినది" వైష్ణవము. ఈ "సంబంధించిన" అన్న అర్థమే ఇటువంటి శబ్దాలన్నిటికీ ఏర్పడుతోంది. ఇదే రకంగా "కైలాసము" అన్న శబ్దం ఎలా ఏర్పడి ఉందాలి? ’కిలాసః - కైలాసము.’ కిలాసః = పరమేశ్వరుడు. ఆతనికి సంబంధించినది/ఆతని నివాసము కైలాసము అని వ్యుత్పత్తి సాధ్యం కావాలి. అయితే ఒక ఇబ్బంది. "కిలాసమ్" అంటే అమరకోశం ప్రకారం పొడ వ్యాధి. " కిలాసం సిధ్మకచ్ఛ్వాం తు పామపామే విచర్చికా " - ఇవన్నీ పొడ/గజ్జి/కుష్ఠు పేళ్ళు. కిలాసిన్ అంటే పొడ వ్యాధి గ్రస్తుడు. కిలాస శబ్దానికి పండుబారిన జుత్తు అని కూడా అర్థం ఉందట. "కిలాస" శబ్దానికి పరమేశ్వరార్థం సాధారణంగా కనిపిం...