పోస్ట్‌లు

జూన్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మాణి - టిబెటన్ ప్రార్థనా చక్రము

చిత్రం
"టిబెటన్ బౌద్ధులు మహాయాన సాంప్రదాయాన్ని పాటిస్తారు. తాము ఆర్జించిన సమస్త పుణ్యాన్ని ప్రాణికోటికి సమర్పించడమే మహాయాన బౌద్ధమత లక్ష్యం. ఎవరు చెప్పొచ్చారు? ఘోరమైన పాపాలలో మునిగి ఉన్న భూమండలంలోని మనుష్యులను సముద్రగర్భంలో ముంచి వేయకుండా భూగర్భంలో కూరుకుపోకుండా టిబెట్ లోని ఈ వేల మాణీలే పని చేస్తున్నాయేమో!" - రాహుల్ సాంకృత్యాయన్. ( తిబ్బెత్ మే సవ్వా బరస్) ******* థిక్సే బౌద్ధారామం లోని మాణి మాణీ అన్నది బౌద్ధ సాంప్రదాయంలో కనిపించే ఒకానొక చక్రం. దీనికి ఖోర్లో ( འཁོར་ལོ། ) అని  పేరు .  లడక్ లో చాలాచోట్ల, ముఖ్యంగా దేవాలయాలలో వరుసగా అమర్చిన చక్రాలు కానీ, లేదా చాలా పెద్దదైన ఒకే చక్రం కానీ కనిపిస్తుంది. ఈ తరహా చక్రాలు లడఖ్ లో మిలటరీ కార్యాలయాల ముందు కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. ఆ చక్రంపైన "ఓమ్ మణిపద్మే హుమ్" అన్న మంత్రం వ్రాయబడి ఉంటుంది. ఈ చక్రం కొయ్యతో కానీ, లోహంతో కానీ చెయ్యబడి ఉంటుంది. మధ్యలో ఇరుసు మాత్రం కొయ్యది అయి ఉంటుంది. ఈ పెద్దచక్రం పై భాగాన ఒక కర్ర బయటకు వచ్చి ఉంటుంది. ప్రతి ప్రదక్షిణంలోనూ ఈ కొయ్య కర్ర - ఆ చక్రానికి పక్కనున్న ఘంటకు తగిలి దానిని మోగిస్తుంది. ...