పోస్ట్‌లు

మే, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

టిబెటన్ స్థూపం.

చిత్రం
బౌద్ధంలో హీనయాన మహాయానాల తరువాత వచ్చిన మతసిద్ధాంతం వజ్రయానం. వజ్రయానంలో బుద్ధుణ్ణి ఒక చారిత్రక వ్యక్తిగా కాక, ఒక అలౌకిక శక్తిగా భావించటం ఉంటుంది. దరిమిలా బుద్ధుని చుట్టూ అనేక బోధిసత్వ అవతారాలు, ఆ అవతారాలకు కొన్ని చిహ్నాలు, ఆ చిహ్నాల చుట్టూ అల్లుకున్న మార్మికత, మండలాలు అనబడే చిత్రాలు, ఆ చిత్రాలకనుగుణంగా ధ్యానపద్ధతులు - ఇలా విలక్షణంగా అల్లుకున్న ప్రత్యేకమైన, ధార్మిక విశ్వాసయుతమైన మతం వజ్రయానం. ఈ విశ్వాసాలకు అనుగుణంగా అవలోకితేశ్వర, మైత్రేయ, వైరోచన, అమితాభ, మహాకాల, అమోఘసిద్ధి, పద్మసంభవ, మంజుశ్రీ ఇత్యాది అద్భుతమైన మూర్తులు, చిక్కని రంగులతో దట్టంగా చిత్రించిన బుద్ధుని అవతారాల బొమ్మలు, ఇంకొన్ని చిహ్నాలు వజ్రయానం లో చోటుచేసుకొని ఇది శాఖోపశాఖలుగా ఎదిగింది. వజ్రయాన మార్మిక బౌద్ధ మూర్తులలో హిందూ దేవతల, దేవుళ్ళు కూడానూ హెచ్చుగానే కనిపిస్తారు. అలాగే బౌద్ధం లో గల కొందరు చారిత్రకవ్యక్తులను బోధిసత్వుని అవతారాలుగా చిత్రించటం ఉంది. ఉదాహరణకు పద్మసంభవుడు ఒక చారిత్రక వ్యక్తి. ఆయన బోధిసత్వుడి అవతారం. లామా కూడా బోధిసత్వుడి అవతారమే. టిబెటన్ బౌద్ధపు ఛాయలు ఇవి. ఈ టిబెటన్ బౌద్ధంలో ఓ చిహ్నం గురించి ఈ వ...