పోస్ట్‌లు

మార్చి, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

మయూఖము - 3

చిత్రం
దేవరాతుడు, భూరివసుడు చిన్ననాటి స్నేహితులు. "మనం పెద్దవాళ్ళైన తర్వాత మనకు అమ్మాయి అబ్బాయి కలిగితే వియ్యంకులు అవుదా"మని, కామందకి అనే ఓ బౌద్ధసన్యాసిని యెదుట బాసలు చేసుకున్నారు. అనుకున్నట్లు గానే దేవరాతుడికి మాధవుడు, భూరివసునికి మాలతి కలిగారు. చూస్తుండగానే పెరిగి యుక్తవయస్కులయ్యేరు. పెళ్ళికిబ్బంది లేదు కానీ ఇద్దరూ ప్రేమించుకుంటే బావుంటుందని దేవరాతుడు తన కొడుకు మాధవుణ్ణి భూరివసుడుండే పద్మావతీ నగరానికి 'అన్వీక్షకి ' విద్య నేర్వమని పంపేడు. అనుకున్నట్లుగానే మాధవుడు మాలతిని చూచాడు. అతనికి ఆమెపై ప్రేమ మొదలయింది. ఈ కథ ఇలా సాగుతుంది. పూర్తి కథను చందమామ కన్నా అందంగా ఇంకెవరు చెప్పగలరు ? భవభూతి రచించిన 'మాలతీమాధవమ్  ' అన్న నాటక కథ యిది. !******! పొగడపూలదండ. సంస్కృత నాటకాల్లో పూలదండల ప్రస్తావన రాంగానే 'కుందమాల ' నాటకం గుర్తొస్తుంది. సీతాదేవి ఓ మాల కట్టి నదిలో జారవిడువటం, అది రాముణ్ణి చేరటం, దాన్ని చూచి రాముడు, ఇది సీత కూర్పేనని గుర్తుపట్టటం అలా కథ కొనసాగుతుంది. ఆ నాటకంలో ఆ మాల అంతగా ప్రసిద్ధమై, మాల పేరే నాటకం పేరయ్యింది. తెలుగు వాళ్ళకూ విడలే...