పోస్ట్‌లు

మార్చి, 2018లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆధునికుని ఒక రోజు కాశీయాత్ర - 2018

చిత్రం
రెణ్ణెల్ల ముందు ఆఫీసులో ఓ రోజు... తండ్రీ! ఏ ఊళ్ళో న్యూ యియర్ ముందు రోజు రాత్రి అరుపులు కేకలు వినిపించవో; ఏ చోట న్యూ యియర్ ముందు రోజు, తాగి తందనాలాడుతూ జనాలు ఊరేగరో; ఏ ప్రదేశంలో తెచ్చిపెట్టుకున్న సంతోషం ఉండదో; ఎక్కడ మెసేజులతో, ఫోన్ కాల్స్ తో పీక్కుతినడం ఉండదో; ఆ ప్లేస్ పేరు చెప్పవా..ప్లీజ్ అనుకున్నాను. బహుశా ఏ దేవుడికో అది వినబడినట్టుంది. డిసెంబరు 30,31, జనవరి 1 మూడు రోజులు సెలవు కలిసి వచ్చింది. ఫలితంగా - వారణాశి ప్రయాణం. సోలో జర్నీ! భారతదేశపు కాశీ గురించినంత సాహిత్యం బహుశా ప్రపంచంలో ఏ నగరం మీదా, మరే ప్రాంతం మీదా ఉండదు. వేదకాలంలో దివోదాసు, ప్రతర్దనుడి కాలం మొదలుకుని, పౌరాణిక కాలం, ఔరంగజేబు నుండి బ్రిటీషు పరిపాలన కాలాదుల వరకూ నేడూ కూడా కాశీ భారతదేశంలో ప్రతి తరంలో, కాలం తాలూకు మార్పులకు, ఒడిదుడుకులకు, తాత్విక చింతనలకు, కళలకు, సంస్కృతికి, భారతీయతకు సాక్షి. కాశీ లో ఎలాంటి వ్యక్తి అడుగుపెట్టినా అతని ఇష్టానికి తగినట్టు ఏదో ఒక అద్భుతమైన విషయం కనిపించక మానదు. ఆఖరుకు తిండి మీద తప్ప వేరే దేని మీదా ఇంటరెష్టు లేనోడికి కూడా కాశీ చెరిగిపోని మధురమైన అనుభూతి మిగులుస్తుంది, నిస్సందేహంగా. కాశీ అంట...