పోస్ట్‌లు

డిసెంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

సంస్కృత సౌరభాలు - 22

చిత్రం
సాధ్వీ గౌః సురభిర్నామ సాగరాదుదభూత్స్వయమ్ | గోప్రసూతా హి గావీ స్యాదసాధుశ్చేతి జానతీ || సురభిః నామ = సురభి అన్న పేరుగల సాధ్వీ గౌః = సాధువైన కామధేనువు సాగరాత్ = పాలసముద్రం నుండీ స్వయమ్ = తనకు తానుగా ఉదభూత్ = పుట్టినది. గోప్రసూతా హి = గోవునకు పుట్టినది గావీ స్యాత్ = (సంస్కృతవ్యాకరణరీత్యా) "గావీ" అయినా అసాధుః చ ఇతి = అసాధువే కదా అని జానతీ = ఎఱిగినది. *************************** ఓ పరమభక్తాగ్రేసరుడైన పండితుడు తన చరమదశలో ఉన్నాడు. విశ్వజిద్యాగం చేసి ఉన్నదంతా దానం చేశాడు. విశ్వజిద్యాగం అంటే సంపాదించినదంతా దానం చేసి కట్టుబట్టలతో మిగలటం. ఈ యాగాన్ని రఘుమహారాజు చేశాడని కాళిదాసు రఘువంశంలో చెబుతాడు. మన పండితుడు కూడా ఆ యాగం చేసి ఒంటరివాడై చిదంబరంలో నటరాజసన్నిధిలో ఆర్తుడై జీవితపు క్షణాలు వెళ్ళదీస్తున్నాడు.  చిదంబరమిదం పురం ప్రథితమేవ పుణ్యస్థలం సుతాశ్చ వినయోజ్జ్వలాః సుకృతయశ్చ కశ్చిత్ కృతాః | వయాంసి మమ సప్తతేరుపరి నైవ భోగే స్పృహా న కించిదహమర్థయే శివపదం దిదృక్షే పదమ్ || (ఈ పురము చిదంబరము. ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం. సుతులు వినయవంతులు.నావి ఏవో కొన్ని కావ్యాలు ఉన్నాయి....